కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలకేంద్రంలోని డార్విన్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషాధారణతో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ సమ్మిరెడ్డి విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
