కరీంనగర్ జిల్లా: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న 3 సంవత్సరాల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా యూ.ఎస్.ఏ కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇదివరకే బాబు జన్మించగా ఆడ శిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును దత్తత ఇచ్చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ భవనంలో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిసిపిఓ పర్వీన్ పాల్గొన్నారు.
