- కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన భూ నిర్వాసితులు..
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. రెండు వరసల రహదారిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సోమవారం రోజున ఆ ప్రాంత భూ నిర్వాసితులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రెండు వరసల రహదారి నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించకుండా, ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా,వేసిన పంటను నిర్దక్షణంగా తొలగిస్తూ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. ఈ విషయంపై లోగోడ సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని , గౌరవ హైకోర్టులో ఈ విషయంపై కేసు వేయడం జరిగిందని తెలిపారు. దీనికి కోర్టు మూడు వారాల గడువులోపు రైతుల సమస్య పరిష్కరించాలని ఆదేశాలు, ఆర్డర్స్ కూడా ఇచ్చిందన్నారు. కానీ కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కచేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ రహదారి నిర్మాణ పనులను చేపడుతున్నారని. మాదాపూర్, ఖాసీంపేట రైతులు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు.