కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పారువెళ్ల మార్గమధ్యలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జి మరమ్మతులు అధికారులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పారువెల్ల నుండి గన్నేరువరం వెళ్లడానికి రాకపోకలు నిలిచాయి.లో లెవెల్ బ్రిడ్జి కూడుకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే అధికారులు స్పందించి జెసిబి సాయంతో కూడుకపోయిన మట్టిని చెత్త, చెట్లను తొలగించడం జరిగింది . దీంతో పారువెల్ల గ్రామ ప్రజలకు కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. మళ్లీ వర్షం పడితే గన్నేరువరం మండల కేంద్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే తాత్కాలికంగా పనులు కాకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి,ఇ ఇ,వి నరసింహ చారి,ఆర్ అండ్ బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రాజశేఖర్, ఏ ఇ ఇ, కే సురేష్,కాంట్రాక్టర్ నరసయ్య,పంచాయతీ కార్యదర్శి రాములు,గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి,ఎల్లాల లచ్చిరెడ్డి, యల శ్రీనివాస్ రెడ్డి, బద్దం హనుమంత రెడ్డి, పిట్టల రాములు,యల్ల నరసింహారెడ్డి, ఈగ అనిల్, ఆశల్, రాజలింగు,సిహెచ్ తిరుపతి, వెంకటి,ఎం మధు, కొమురయ్య, మంకాల , లస్మయ్య, లింగంపల్లి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
