కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలంలోని గ్రామలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసే గణేష్ ఉత్సవ నిర్వాహకులకు భద్రత , బందోబస్తు కోసం గణేష్ ఆన్లైన్ నమోదు తప్పనిసరి అని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. పోలీస్ శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబందించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ , మండపాలకు సంబందించిన సమాచారం కోసం మాత్రమే రూపొందించినది అన్నారు. ఈ సమాచారం ద్వారా భద్రత , బందోబస్త్ ఏర్పాటు చేయడానికి పోలీస్ వారికి సులువుగా ఉంటుందని తెలిపారు. గణేష్ ఉత్సవ నిర్వహకులు గణేష్ విగ్రహాలను వారి ప్రాంతాలలో ఏర్పాటు చేసే ముందు , ముందస్తు సమాచారం పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటరు లేదా మొబైలు నందు అప్లై చేసుకోవాలన్నారు. అందుకోరకు http://policeportal.tspolice.gov.in/index.htm అనే సైటు నందు వివరాలు పొందుపరిచి అప్లికేషన్ ను పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచించారు.సామాజిక మాద్యమాలలో వచ్చే ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని , ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్న ,నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవాలని లేదా 100 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.
