కరీంనగర్ – గన్నేరువరం : నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేసిన కసాయి కొడుకులు.. కోడళ్ళు… వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పద్మశాలి కాలనీలో వృద్ధురాలైన కన్నతల్లిని.. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. అనాథగా వదిలేశారు కన్న కొడుకులు.. కోడళ్ళు… వొడ్నాల లచ్చవ్వ కు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు వొడ్నాల అంజయ్య, చిన్న కొడుకు బలరాం, తల్లి బాగోకులు చూసుకుంటామని తల్లిని నమ్మించి ఇండ్ల భూమి పంపకాలైన తర్వాత ఎవరిది వాళ్లు ఇండ్లు కట్టుకొని వేరువేరు ఉంటున్నారు.. కొద్దిరోజులు తల్లిని చేసుకున్నట్టు నటిస్తూ కొడుకులు కోడళ్ళు వేధింపులకు గురిచేశారని లచ్చవ్వ ఆవేదన వ్యక్తికం చేసింది. అదే కాలనీలో రెండు రోజుల నుంచి అడుక్కొని తింటుందని తెలిపింది.
ఈ విషయంపై పెద్ద కుమారుడు అంజయ్య ఇంటి వద్దకు రిపోర్టర్ వెళ్లగా అందుబాటులో లేరు.. ఫోన్లో అంజయ్యను వివరణ కోరగా నాకు ఎలాంటి సంబంధం లేదు కోడళ్లతోటి వచ్చింది గొడవ వాళ్లను అడుగుమని ఫోన్ కట్ చేశాడు..
చిన్న కుమారుడు బలరాం ను అడుగగా ఒక వారం నేను చూసుకుంటానని ఒక వారం మా అన్న చూసుకుంటాడని తెలిపాడు..
తల్లిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని పక్కింటి వాళ్లను తెలుసుకుంటే ఇద్దరు కోడళ్ళు లచ్చవ్వ ను ఇబ్బందులు గురిచేసింది నిజమేనని చెప్పారు.
పలుమార్ల పెద్దమనుషుల సమక్షంలో లచ్చవ్వ తన ఇద్దరు కొడుకులు కోడళ్ళు మధ్య చాలాసార్లు పంచాయతీలు జరగగా కొడుకుల తీరు మారలేదు..
ఆ నోట ఈ నోట రిపోర్టర్ టీవీకి శుక్రవారం నాడు సమాచారం తెలిసింది.. ఈ విషయం పై రిపోర్టర్ పోలీసులకు సమాచారం అందించారు.. కొడుకులు కోడళ్ళు పై చర్యలు తీసుకోవాలని లచ్చవ్వకు న్యాయం జరగాలని కాలనీవాసులు కోరుతున్నారు.










