కరీంనగర్ జిల్లా: జిల్లా స్థాయి లో గురువారం నిర్వహించిన టి.ఎల్.ఎమ్ మేలా లో గన్నేరువరం మండలానికి చెందిన ఉపాధ్యాయులు పది మంది పాల్గొన్నారు. అందులో నుండి తెలుగులో గునుకుల కొండాపూర్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సమత జిల్లా స్థాయిలో ప్రథమ స్థానము పొంది రాష్ట్రస్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో ఇంగ్లీషులో గునుకుల కొండాపూర్ పాఠశాలలోని ఎస్ శ్రీలత రెండో స్థానంలో నిలిచారు. వారిద్దరికీ మండల విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా మండల విద్యాధికారి రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
