కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం మున్నూరు కాపు సంఘము అధ్యక్షుడు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో మానేరు వాగు పై వంతెన కోసం 77 కోట్ల నిధులు మంజూరు చేయడానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసి చర్చలు జరిపిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మలకు శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి బ్రిడ్జి కొరకు కృషి చేసిన బండి సంజయ్ మరియు కవ్వంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పుల్లెల నందయ్య,గొల్లపల్లి రవి, పుల్లెల మల్లయ్య, కొట్టే భూమయ్య, పుల్లెల మీనయ్య, బోడ మాధవ రెడ్డి, పుల్లెల తిరుపతి,తోట శ్రీధర్,పుల్లెల రాము, పుల్లెల జగన్ మోహన్, శంకర్, గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










