కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి సముదాయం భవనం కప్పు పై పేరుకుపోయిన చెత్తను పంచాయతీ అధికారులు ఆదివారం తొలగింపజేశారు. ఎంతో కాలంగా ఇక్కడ చెత్త నిల్వ ఉండడంతో తీవ్ర ఆసౌకర్యం కలుగుతుందని గ్రహించిన కార్యదర్శి వెంకట్ రెడ్డి తక్షణమే కూలీలను పెట్టి చెత్తను,చెట్ల కొమ్మలను తొలగించారు..
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంతోమంది అధికారులు వచ్చినప్పటికీ భవనంపై పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో భవనం శిథిలవస్థకు చేరుకునే పరిస్థితిలో ఉండగా ఇక్కడ పనిచేస్తున్న కార్యదర్శి వెంకట్ రెడ్డి శనివారం భవనాన్ని పరిశీలించి ఆదివారం నాడు భవనంపై పేరుకుపోయిన చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించారు.. కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ శభాష్ వెంకటరెడ్డి అని పలువురు అభినందించారు .. గన్నేరువరంలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలను, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు జిపి కార్మికులతో శుభ్రం చేపిస్తూ పరిశుద్ధ పనులను పరిశీలిస్తూ గ్రామ అభివృద్ధిలో తనదైన శైలిలో కార్యదర్శి వెంకట్ రెడ్డి ముందుకు దూసుకెళ్తున్నాడు.