కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో ఆదివారం మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ అధికారులు సరియిన విధి దీపాలు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల మహిళలు ఎంగిలిపుల బతుకమ్మ ఆడలేక ఇబ్బందులు పడ్డారు.. గత కేసీఆర్ పాలనలో ఎంతో గొప్పగా బతుకమ్మ వేడుకలు వెలుగులలో జరుపుకున్నాము అని, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు సరియిన సమయం లో నిర్వహించలేక పోవడంతో పాలన కుంటు పడింది.. సరియిన ఏర్పాటు ఎక్కడ కూడా చేయకుండా ఎవరు పట్టించుకోవడం లేదు అని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు, మండల అధికారులకు సూచిస్తే ఆ మాటను అధికారులు తుంగలో తొక్కి పక్కన పెడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి జంగపల్లి గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు..
