కరీంనగర్ జిల్లా: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మోయతుమ్మెద వాగు నుండి బుధవారం మధ్యాహ్నం రెండు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకని తోటపల్లి గ్రామం నుండి గన్నేరువరం మండలం లోని గ్రామాలకు తరలిస్తుండగా ఎస్సై నరేందర్ రెడ్డి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అట్టి ట్రాక్టర్ల డ్రైవర్లు మరియు యజమానుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
