కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారైనట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను 17 దుకాణాలు గీత కార్మికులకు, 9 మద్యం దుకాణాలు ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. 94 దుకాణాల్లో ఏయే దుకాణాలు గీత కార్మికులకు, ఎస్సీలకు రిజర్వ్ చేయాలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు.
జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణదారుల ప్రస్తుత కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30 న ముగియనంది. డిసెంబరు 1, 2025 నూతన టెండర్లు దారులను ఖరారు చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, ఎస్సీ సంక్షేమ శాఖ డిడి నాగలేశ్వర్, సిఐలు జి.రాము ఎస్.అశోక్, ఎస్.బాబా, ఎస్ఐలు మహమ్మద్ ఇషాఖ్ పాషా, విజయ్ ఎక్సైజ్ సిబ్బంది అనిల్, సాయి కృష్ణ పాల్గొన్నారు.
