కరీంనగర్ జిల్లా: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బతుకమ్మ సంబురాలు నగరంలోని మహాత్మా జ్యోతిబా మైదానంలో బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి.ఈ సంబరాలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారదా,శాసనసభ్యులు మానకొండూర్ డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమీల సత్పతి,సీపీ గౌస్ ఆలం,మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
