● 24 గంటలు కాకముందే మళ్లీ సమస్య
కరీంనగర్ జిల్లా: ఇటీవల వర్షాల కారణంగా గన్నేరువరం మండలంలోని జంగపల్లి – హన్మజీపల్లి కల్వర్టు రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. ఇటీవల గ్రానైట్ లారీలు రాత్రి వెళ్లడంతో రోడ్డు ధ్వంసమై గుంతలుగా ఏర్పడ్డాయి… ఆదివారం రోజు కాంగ్రెస్ నాయకులు మరమ్మతులు చేపట్టి పైపులు వేసి మట్టి పోసి ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూశారు.. సోమవారం బతుకమ్మ పండుగ రోజు గ్రానైట్ లారీ జంగపల్లి కల్వర్టుపై లారీ తో పాటు కుంగింది… పనులు చేసింది ప్రజల కోసమా గ్రానైట్ లారీల కోసమా? అని స్థానికులు ప్రయాణికులు మండిపడుతున్నారు.