- కామన్ సెన్స్ లేదా అంటూ బూతు పురాణం
- అర్ధరాత్రి కాలినడక తో ఇంటికి వెళ్లిన జర్నలిస్టులు
- ఆందోళన బాటకు సిద్ధమైన జర్నలిస్టులు
కరీంనగర్ జిల్లా: పట్టణంలో ట్రాఫిక్ ఏసిపి రెచ్చిపోయారు. బతుకమ్మ కవరేజ్ కి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ పై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన ఘటన జర్నలిస్ట్ సంఘాల్లో ఆందోళన కలిగిస్తుంది. బతుకమ్మ సంబరాల సందర్భంగా రాత్రి 11:30 గంటలకు నిమజ్జన కవరేజ్ కి వెళ్తున్న ఓ మీడియా ఫోటోగ్రాఫర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో డివైడర్ నుండి రోడ్డు దాటుతుండగా వెంటనే బైకును పట్టుకొని ట్రాఫిక్ ఏసిపి స్వామి.. ”ఎవడ్రా నువ్వు ,, అంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. ఏసీపీ మాటలతో షాక్ కు గురైన ఫోటోగ్రాఫర్, మరో మీడియా ప్రతినిధి సార్ మేము సీనియర్ జర్నలిస్టులు తానో సీనియర్ ఫోటో గ్రాఫర్ బతుకమ్మ కవరేజ్ కు వచ్చాం అంటూ చెప్తుంటే ” నువ్వు సీనియర్ ఫోటోగ్రాఫర్ వా నీకు కామన్ సెన్స్ లేదా యూజ్ లెస్ ఫెలో ” అంటూ పరుష పదజాలంతో దూషిస్తూ ఎసిపి వారి బైకు ను లాక్కున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై అగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు రా వీడియో రికార్డ్ చెయ్యు, బైకు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టు.. నాకు తెలియకుండా బైకు బయటకు వెళ్లొద్దు అంటూ హెచ్చరికలు జారీచేసి ఆ బైకును అక్కడి నుండి స్టేషన్కు తరలించారు. దీంతో చేసేది ఏమీ లేక సదరు జర్నలిస్టులు అర్ధరాత్రి కాలినడకన ఇంటికి చేరుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాలు పోలీసులు తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాటకు సిద్ధమవుతున్నారు.