కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మాజీపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి గ్రామం లో మొత్తం జనాభా 2100 ఉండగా, అందులో ఎస్సీ జనాభా సుమారు700 పైచిలుకు జనాభా ఉన్నా గాని అధికారుల లెక్కల ప్రకారం 53 జనాభా ఉన్నట్లుగా లెక్కించారు. దానివల్ల ఆ గ్రామానికి ఎస్సీ రిజర్వుడు సర్పంచ్ స్థానం గాని మరియు 10 వార్డు స్థానాలు ఉన్న? ఒక్క స్థానంలో కూడా ఎస్సీ రిజర్వుడు స్థానాలు రాకపోవడంపై అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అమ్మిగల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి పారునంది అశోక్, గౌరవ అధ్యక్షులు శివుండ్ల రాజయ్య, అమ్మిగల్ల శ్రీనివాస్ కమిటీ సభ్యులు అజయ్, రాజు, మహేష్, పరుశురాం, సంజీవ్, రమేష్, మల్లేష్ ఆధ్వర్యంలో గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ కి మరియు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
