- ఎస్సై జి. నరేందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా గన్నేరువరం మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు దుర్గమాత నిమర్జన ర్యాలీలను, నిమజ్జనాలను ఉదయం 06:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల లోపు మాత్రమే జరుపుకోవాలని ఎస్సై జి. నరేందర్ రెడ్డి తెలిపారు. రాత్రి 10 తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి ఊరేగింపులకి అనుమతులు లేవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు..
ఎస్సై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగను ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. అలాగే గన్నేరువరం మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..