కరీంనగర్ జిల్లా: నారీ శక్తి లో భాగంగా మహిళల భద్రత కోసం మహిళా బ్లూ కోల్ట్స్ స్పెషల్ పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేసినట్లు చొప్పదండి ఎస్ఐ ఎస్సై నరేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళల పట్ల ఆకతాయిలను అరికట్టేందుకు ఈ టీం పని చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే 100 సమాచారం అందించాలన్నారు. ప్రతిరోజు మండల వ్యాప్తంగా బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. మండల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
