కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం: చొక్కారావుపల్లికి చెందిన అరికంతం పద్మ–మునీందర్ రెడ్డి దంపతులు శ్రద్ధాభక్తులతో శ్రీ మానసా దేవి ఆలయానికి బంగారు అభరణాలు బహుకరించారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
బహుకరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు సైతం పాల్గొన్నారు. అమ్మవారికి అర్పించిన ఈ బంగారు ఆభరణాలు దేవస్థాన సమృద్ధికి తోడ్పడతాయని, భక్తుల భక్తి-విశ్వాసాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని చైర్మన్ చంద్రారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా అరికంతం దంపతులు మాట్లాడుతూ, తమ కుటుంబంలో శాంతి, ఆనందం ఏర్పడాలని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో అమ్మవారికి ఈ బహుమతిని అర్పించామని పేర్కొన్నారు.
స్థానికంగా ఈ కార్యక్రమం భక్తుల కోణంలో విశేష ఆకర్షణగా నిలిచింది.