- త్రాగునీటి గోసను తీర్చండి.. యువ నాయకులు గూడూరి సురేష్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో చవడి వద్ద ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ రెండు సంవత్సరాల నుండి గ్రామస్తులకు మంచినీరు అందించడం లేదు.. వాటర్ ప్లాంట్ ను రిపేర్ చేసి మళ్లీ పునర్దించాలని ఎమ్మెల్యే మరియు అధికారులకు యువ నాయకులు గూడూరి సురేష్ విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ టీవీ తో సోమవారం సురేష్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మినరల్ వాటర్ ప్లాంట్ ను రిపేర్ చేయక రెండు సంవత్సరాలు కావస్తున్న ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడమే లేదన్నారు. రెండు సంవత్సరాలు నుండి రిపేర్ లో ఉండటం వల్ల ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గన్నేరువరంలో పదవులు పొందిన నాయకులు పదవుల కోసమే ఆరాటం తప్ప ఊరు సమస్యల పట్ల పట్టింపులేదని అన్నారు.