కరీంనగర్ జిల్లా: “మొంథా” తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో గన్నేరువరం మండలంలో రెండు రోజుల పాటు భారీ నుంచి కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 30,31 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటువద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని ఎస్సై కోరారు.

వర్షాల నేపథ్యంలో సహాయం కోసం గన్నేరువరం పోలీస్ స్టేషన్ 8712670771 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఎస్సై నరేందర్ రెడ్డి సూచించారు.









