కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బోయిని సాయికుమార్ పదోతరగతి చదువుకుంటున్నాడు. రోజు లాగానే మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చాడు. క్లాస్ రూమ్ లో పురుగుల మందు తాగిన విద్యార్థి.. ఒక్కసారిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు షాకుకు గురయ్యారు.
హుటాహుటిన కారులో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఉపాధ్యాయులు సాయికుమార్ ను తరలించారు.. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నేరువరం పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులు రామయ్య ను వివరణ కోరగా విద్యార్థి పాఠశాలలో ఆకతాయి పనులు చేస్తూ తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడని… విద్యార్థి తండ్రి చంద్రయ్యను పాఠశాలకు పిలిపించి పరిస్థితి తండ్రికి వివరించగా విద్యార్థి తండ్రి దండిస్తాడేమోనని భయంతో గడ్డి మందు తాగినట్లు తెలిపారు.
విద్యార్థి మాత్రం తాను ఏ విధమైన ఆకతాయి పనులు చేయలేదని ఎవరో చేసిన పనికి తనకు టీసి ఇచ్చి పంపిస్తానని ఉపాధ్యాయులు బెదిరించడంతో గడ్డి మందు తాగానని తెలిపినట్లు సమాచారం.
విద్యార్థి పాఠశాలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో, గడ్డి మందు డబ్బుతో విద్యార్థి పాఠశాలకు ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది, ఏది ఏమైనా పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం మిస్టరీగా మిగిలింది.









