కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి కారు అదుపుతప్పి దూసుకెళ్లి కల్వర్టు లో బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు,గన్నేరువరం నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. కరీంనగర్ పట్టణానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు..
బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాడూరి వంశీకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణగారు రోడ్డు ఎలాగైనా వెయ్యలేరు కానీ కల్వర్టులు పూర్తిగా దెబ్బతిని పాడేయని కల్వర్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.. రోజుకో ప్రమాదం జరిగిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.. డబుల్ రోడ్డు పనులు ప్రారంభించి వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు.








