కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల నూతన ఎమ్మార్వో గా హుజురాబాద్ మండలం నుండి బదిలీ పై వచ్చిన కోడెం కనుకయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువా తో ఘనంగా సన్మానించారు. ఇక్కడ పని చేసిన ఎమ్మార్వో నరేందర్ హుజురాబాద్ బదిలీ పై వెళ్లారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రణయ్. ఆర్ఐ ప్రవీణ్. ఆర్ఐ రఘు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనాథ్. రమేష్. జంగపల్లి,ఖాసీంపేట డీలర్లు ఆంజనేయులు.రమేష్ బాబు పాల్గొన్నారు









