కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని: ఈరోజు ELTA తెలంగాణ వారు మండల స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఎడ్యుక్వెస్ట్ టాక్ పోటీలను PMSHRI ZPHS గన్నేరువరం పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు గన్నేరువరం మండల విద్యాధికారి కె. రామయ్య సర్టిఫికెట్స్ అందజేసి ,జిల్లాస్థాయి పోటీలకు శుభాభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల విద్యాధికారి కె. రామయ్య , మండల ఆంగ్ల ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్, వసుంధర మరియు ఎం. శ్రీలత పాల్గొన్నారు.









