◆ చర్యలు తీసుకోవాలని ప్రజల విన్నపం..
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో కుక్కల బెడతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గన్నేరువరం మండల అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పుల్లెల జగన్ మోహన్ మాట్లాడుతూ గత కొంతకాలంగా గన్నేరువరం లోని అన్ని వార్డులలో కుక్కల బెడద ఎక్కువైందని, కుక్కలు ప్రజల వెంటపడి కాటు వేస్తున్నాయని, గన్నేరువరం – చొక్కారావుపల్లె గ్రామాల మధ్య చెరువు కట్టమీద రైతులు, ప్రజలు నుంచి కోతులు బెదిరిస్తూ వస్తువులన్నీ లాక్కొని ధ్వసం చందరవందరం చేస్తూ ప్రజల మీద పడి దారుణంగా దాడులు చేస్తున్నాయని అయినా కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని జగన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వార్డుల్లో ఉన్నటువంటి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరారు..










