contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: కరీంనగర్ కమీషనరేట్ లోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని అవసరమైన అన్నీ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలని, పాత ఎన్నికల నేరస్థులు, రౌడీ షీటర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎన్నికల ప్రక్రియ కు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో వారికి కేటాయించబడ్డ ప్రాంత పరిధి గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎక్కువగా  జరగనున్నందున రెట్టించిన ఉత్సాహంతో, పటిష్ట ప్రణాళికతో పనిచేయాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని, గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలనీ, ఉల్లంఘిస్తే బౌండ్ డౌన్ చేసి పూచికత్తు సొమ్ము మొత్తాన్ని జప్తు చేయాల్సి వస్తుందని మరియు జైలు శిక్షకూడా విధించబడుతుందని వారికి తెలపాలన్నారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల నియమావాళిని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కాగా అమలు పరచాలన్నారు. ఈకార్యక్రమంలో గన్నేరువరం ఎస్సై చందా నర్సింహా రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :