contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య

కరీంనగర్ జిల్లా / సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం : బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష–రుక్మిణి దంపతులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గ్రామానికి చెందిన కొందరి వద్ద లక్షల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డబ్బులు తిరిగి చెల్లించాలంటూ శ్రీహర్షపై పలువురు ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల డబ్బుల చెల్లింపుకు వాయిదా పడటంతో గ్రామంలో తన పరువు పోతుందనే మానసిక ఆందోళనకు లోనై దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇంట్లో లభించిన సూసైడ్ నోట్‌లో తమ మరణానికి కారణమైన వారిగా కొందరి పేర్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మానసిక వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతుల బంధువులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :