- వాట్సాప్ లో అపరిచిత లింకులతో మోసాలు..
- తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భూఖ్య నరేష్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గన్నేరువరం శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై బ్యాంక్ సేవలపై కళాజాత బృందంతో అవగాహన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూఖ్య నరేష్ మాట్లాడుతూ పొదుపును ప్రతి ఖాతాదారుడు అలవాటు చేసుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ లో వచ్చే అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఆన్లైన్ మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. రూ.20 ఏడాది కడితే రెండు లక్షల ప్రమాద బీమా, రూ.436 ఏడాది కడితే రెండు లక్షల సాధారణ భీమా తప్పనిసరి చేసుకోవాలన్నారు. ప్రైవేట్ ఫైనాన్సు లో కాకుండా బ్యాంకులలో మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు లోన్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామంచ స్వామి, పద్మశాలి సంఘ అధ్యక్షుడు తెల్ల రవీందర్, గౌరవ అధ్యక్షులు తెల్ల చంద్రశేఖర్, వార్డు సభ్యులు వెదిరే విజేందర్, ఉపాధ్యక్షుడు మచ్చ బాలరాజు, బూర రామకృష్ణ, సబ్బని మహేష్,తెల్ల సుధాకర్, లక్ష్మణ్, వేముల రవి, ప్రసాద్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.









