కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ తీసుకుంటున్న చొరవను అభినందించారు. నూతన సంవత్సరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సురేందర్ (ఎస్సై), శ్రీనివాస్ (ఎస్సై) మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు క్యాలెండర్ ఆవిష్కరించిన సీపీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.









