కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం రోజున వికసిత్ భారత్ గన్నేరువరం మండల కన్వీనర్ పుల్లెల రాము ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ అధ్యక్షతన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ్ ( విబి – జి రామ్ జి ) చట్టం 2025 మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికసిత్ భారత్ జిల్లా కన్వీనర్ మరియు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాల ఉపాధి మరియు ఆర్థిక భరోసా కోసం చేసిన విబి – జి రామ్ జి కొత్త చట్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి మీద దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. కన్వీనర్ పుల్లెల రాము మాట్లాడుతూ గతంలో ఉన్న 100 రోజుల పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచారని సంవత్సరంలో 60 రోజులు సెలవు దినాలు ప్రకటించుకునే వెసులుబాటు ఉందని గతంలో 15 రోజులు దాటిన రాని వేతనం డబ్బులు ఇప్పుడు పని చేసిన వారం రోజుల లోపు డబ్బులు వేయడం జరుగుతుందని ఈ చట్టం గురించి బిజెపి కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ కొ-కన్వీనర్ పుల్లెల జగన్ మోహన్, ఏలేటి చంద్రా రెడ్డి, బండ తిరుపతి, గాదె వెంకన్న, కాంతల రాజిరెడ్డి, చొక్కాల లక్ష్మయ్య, మునిగంటి సత్తయ్య, రాముడి కృష్ణమూర్తి, బొమ్మాడి సురేందర్,తాడూరి రమణారెడ్డి, మచ్చ మురళి, టేకు అనిల్, కుంభం విష్ణు, దానవేని ప్రశాంత్, జీల ఎల్లయ్య, గూడూరి జగన్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..









