కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల విద్యాధికారిచే తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ గన్నేరువరం మండలం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ మండల విద్యాధికారి రామయ్య చేతుల మీదుగా నేడు ఎమ్మార్సీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీ రామయ్య మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే సత్వరమే పరిష్కరించగలరని హామీ ఇచ్చినారు అదే విధంగా పాఠశాలల బలోపేతానికి సంఘం చేయూతనిందించాలని కోరినారు. తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ జారతి నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కేవలం విద్యా బోధన మాత్రమే కాకుండా విద్యార్థులలో చిన్నప్పటి నుండే దేశభక్తి జాతీయ భావన కల్పించే విధంగా పనిచేస్తుందని తెలిపినారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల శ్రద్ధ చూపాలని సత్వరమే పి ఆర్ సి కమిటీ ఇచ్చే నివేదికను తెప్పించుకొని పిఆర్సి అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నియామకాలను సత్వరమే చేపట్టి ప్రాథమిక పాఠశాలల బలోపేతం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ లతో పాటుగా శ్రీధర్, మహేష్, నరేందర్, లక్ష్మీనారాయణ, విజయపాల్ రెడ్డి, మధు, తిరుపతి, కిరణ్, శ్రీలత, శిరీష, జ్యోతిలక్ష్మి, ప్రసన్న, అనిత, సుప్రియ, అర్షియానాజ్ తదితరులు పాల్గొన్నారు.








