కరీంనగర్ జిల్లా, గన్నేరువరం: గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ శివార్లలో బిక్కవాగు నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం గన్నేరువరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో, ట్రాక్టర్ ద్వారా ఇసుకను గన్నేరువరం గ్రామానికి తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనలో ట్రాక్టర్‌ను నడిపిన డ్రైవర్ బత్తిని రమేష్ (గన్నేరువరం)తో పాటు ట్రాక్టర్ యజమాని బత్తిని చంద్రశేఖర్ (గన్నేరువరం)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై జి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.








