కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన విభూతి వీరకుమార్ వయస్సు (53) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున అకాల మరణం చెందాడు.. ఉమ్మడి బెజ్జంకి మండలం మరియు గన్నేరువరం మండలానికి జర్నలిస్టుగా విధులు నిర్వహించాడు. ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, వివిధ పత్రికలలో పనిచేసి మంచి గుర్తింపు పొందాడు.. గ్రామంలో రేషన్ డీలర్ గా సేవలందించాడు.. నిరంతరం మండలంలోని ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తన వంతుగా మండల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.. భార్య,ఇద్దురు కుమారులు ఉన్నారు..
విరకుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బుర్ర రాజ్ కోటి గౌడ్, చీమలకుంటపల్లి గ్రామ సర్పంచ్ జంగిటి ప్రకాష్, గన్నేరువరం మండల మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తెల్ల రవీందర్,సీపీఐ మండల కార్యదర్శి చోక్కల శ్రీశైలం, కుసుంబా అంజయ్య, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.








