contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఓటర్లకు వసతులు కల్పించడంలో .. అధికారులు విఫలం

కరీంనగర్ టౌన్: నేడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది.. మునిసిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటర్ పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేసే ముందు అధికారులకు వ్యక్తి దృవీకరణ సంబంధించిన కార్డు చూపించవలసి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు తప్పనిసరిగా ఓటర్ తమ వెంట 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి అధికారులకు చూపుతే సరిపోతుందని వారు తెలిపారు.

కరీంనగర్ పట్టణంలోని 57వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.. పలు పోలింగ్ కేంద్రాల అవరణంలో వీల్ చైర్లు కూడా లేక దివ్యాంగులు, వృద్ధులకు తిప్పలు తప్పలేదు.

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా స్ట్రాంగ్, రూములు బ్యాలెట్ బాక్సులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చైర్లను అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన ఇతర సమగ్రి అందుబాటులో ఉండే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కింద అధికారులు మాత్రం వాటిని తుంగులో తొక్కేశారు…. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటు వినియోగించుకునే దివ్యాంగులకు , వృద్ధులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న ఓటర్లు కోరుతున్నారు..

80 ఏళ్లు వయస్సు గల ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు తమ ఓటు హక్కును వినియోగించుకుందామని వస్తుంటే.. వృద్ధులు ఇబ్బంది పడుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సర్ మాత్రం చూసుకుంటూ ఉన్నాడే తప్ప.. ఆ వృద్ధులను వీల్ చైర్ లో తీసుకెళ్లలేదు.. అక్కడ ఉన్న వేరే ఓటర్లు అగ్రహానికి గురయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :