కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలోని గరిగే దేవమ్మ అనారోగ్యం కారణం వల్ల హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యం కోసం ఆపరేషన్ కొరకు లక్ష యాభై వేల రూపాయలు అత్యవసరం ఉండగా మానకొండూరు ఎమ్మెల్యే ని సంప్రదించగా వారు అట్టి రూపాయలను ప్రభుత్వం నుండి ఎల్ఓసి ఇప్పించారు..
ఆ ఎల్ఓసి ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం ఆదివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వారి ఇంటికి వెళ్లి దేవమ్మ భర్త చంద్రయ్యకు అందజేశారు.
ఎల్ఓసి ని ఇప్పించినందుకు ఎమ్మెల్యే కి దేవమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు మరియు యస్వాడా గ్రామ సర్పంచ్ కటకం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, రాపోలు నవీన్,బుర్ర మల్లేష్ గౌడ్, దేశరాజు అనిల్, పాకాల పరుశురాం, మునీందర్, పాల్గొన్నారు.








