కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. చత్రపతి యువసేన ఆధ్వర్యంలో జరిగిన చత్రపతి శివాజీ జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మాదరి శ్రీనివాస్ హాజరైనారు.
అనంతరం సర్పంచ్ మాదరి శ్రీనివాస్ మాట్లాడుతూ హైందవ ధర్మ స్థాపనే ఆదర్శంగా, పోరాటం చేసిన యోధుడు.. హైందవ శక్తిని చాటుటకు సింహమై గర్జించిన అరివీర భయంకరుడు హిందుత్వమే నినాదంగా.స్వధర్మమే ప్రధానంగా, భవాని మాత ఆజ్ఞతో హిందూ సమాజ స్థాపన ధ్యేయంగా మారాటాల వీరుడు వీరుడు గా గుర్తింపు పొందిన శివాజీ గారిని స్మరించుకోవడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చత్రపతి యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. చత్రపతిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు కదలాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బండి తిరుపతి యాదవ్, మాడుగుల రామకృష్ణారెడ్డి, కన్నం ప్రవీణ్ కుమార్, ఆసరా శ్రీనివాస్, ఆసరి పరుశరాములు,మార్గం మహేష్, గంగాధర్ ఆంజనేయులు, సుంకరి రమేష్, గంగాధర మహేందర్, కన్నం మనోజ్, దమగల సురేష్, కొత్తగట్టు ఆంజనేయులు, కుమ్మరి రమేష్ ,నావల్ల సుధాకర్, సంపతి శివకృష్ణ, అన్మాసుల రాజిరెడ్డి, నూనె మల్లారెడ్డి, మార్గం తిరుపతి రాకేష్, అనిల్, బాలయ్య, కొరవి అజయ్, పేరజి అజయ్, కుమ్మరి పోశయ్య తదితరులు పాల్గొన్నారు.








