కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ.. ఉప సర్పంచ్ న్యాలపట్ల రమేష్ (రాజు) పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు కలిసి చత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ హైందవ ధర్మ స్థాపనే ఆదర్శంగా, విధర్మీయులతో అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు… హైందవ శక్తిని చాటుటకు సింహమై గర్జించిన అరివీర భయంకరుడు.. హిందుత్వమే నినాదంగా.. స్వధర్మమే ప్రధానంగా భారత జాతిలో స్వాభిమానాన్ని నింపిన వీరుడు.. భవాని మాత ఆజ్ఞతో భారతజాతిని ముష్కరుల నుండి రక్షించిన ధీరుడు.. క్షత్రియ కులవతంస, హైందవ ద్వారక ధర్మోద్ధారక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.








