కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం: గునుకుల కొండాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రెండు బోరు బావులను శుక్రవారం ప్రారంభించారు. మోత్కులపల్లి అరె క్షత్రియ భవనం సమీపంలో ఒక బోరు, వడ్డెర కాలనీలో మరో బోరు బావిని గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ పూజలు నిర్వహించి బోర్లు వేయించారు.
ఈ బోర్లు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. గ్రామంలో ఎండాకాలంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండటంతో ముందస్తు చర్యగా ఈ బోర్లు వేయించడం జరిగిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
గ్రామ ప్రజల తరఫున కేంద్ర మంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బోర్లు ద్వారా గునుకుల కొండాపూర్ గ్రామ ప్రజలకు శాశ్వత నీటి సదుపాయం కలగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ న్యాలపట్ల రాజు, పాలకవర్గ వార్డు సభ్యులు కొరివి నాగమ్మ, కార్యదర్శి రాజేష్, పరశురాములు, సాయి తేజ, సొల్లు హరీష్, బూట్ల సంపత్, టెక్నికల్ అసిస్టెంట్ అనుమండ్ల యాదగిరి, ఆరే సంఘం అధ్యక్షులు సింధు సత్తయ్య, సింధు తిరుపతి, డాక్టర్ వీరేశం, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.








