కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో బుధవారం మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించారు. గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నె కనకవ్వ – వెంకటి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా మానకొండూర్ నియోజవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామంలోని రైతు వేదిక భవనంలో మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ ఉప సర్పంచ్ సందవేణి ఐలయ్య వైకుంఠ రథం బహుకరించారు. మూడవ వార్డు సభ్యుడు కల్లెపెల్లి శ్రీనివాస్ బాడీ ఫ్రీజర్ బహుకరించారు. ఆరవ వార్డు సభ్యుడు ఆడెపు రాజు అంబులెన్స్ బహుకరించారు. ముగ్గురు దాతల నుండి గ్రామపంచాయతీకి అందజేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,తాసిల్దార్ కె. కనకయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,గ్రామ సర్పంచ్ కర్నె చంద్రయ్య, ఉప సర్పంచ్ సందవేణి ఐలయ్య, బెంజ్జకి, గన్నేరువరం ఏఎంసి చైర్మన్ పులి కిష్ణ, ఏఎంసి డైరెక్టర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మతంగి అనిల్,వివిధ గ్రామాల సర్పంచులు అరికాంతం గోపాల్ రెడ్డి, జంగిటి ప్రకాష్,డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి,గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పర్తి పరిపూర్ణ చారి,కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు జె.రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు అల్వాల కోటి, బుర వెంకటేశ్వర్,వెదిరే విజయేందర్, తదితరులు పాల్గొన్నారు.








