కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఈజిఎస్ (ఉపాధి హామీ) పనుల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఎన్.ఎం.ఎస్ యాప్ అటెండెన్స్ లో, ఈ కేవైసీ ఫేస్ అటెండెన్స్ విధానం అమలు చేయగా గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ పర్యవేక్షించారు. ఉపాధి కూలీలకు అవసరమైన సూచనలు చేస్తూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు నిర్వహిస్తున్న కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్మికులు ప్రతిరోజు హాజరు నమోదు సమయంలో ఫేస్ అటెండెన్స్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు న్యాలపట్ల పరశురామ్ గౌడ్, సొల్లు హరీష్, కొరివి నగవ్వ, బూట్ల శ్రీలత, లింగంపల్లి రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, కార్యదర్శి పిట్టల రాజేష్, పుష్ప, తిరుపతి, సత్తయ్య పాల్గొన్నా








