కరీంనగర్ జిల్లా చొప్పదండి పరిధిలోని రుక్మాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన తాటికొండ సాయికిరణ్ (24), చిలుక ప్రదీప్ కుమార్ (24)లు TS08FF6269 నంబర్ గల ద్విచక్ర వాహనంపై రుక్మాపూర్ నుండి చాకుంట వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో చాకుంట క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ నుండి ధర్మారం వైపు వెళ్తున్న TS15UA1818 నంబర్ గల టిప్పర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది.
టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడు ప్రదీప్ కుమార్ తండ్రి చిలుక రాజేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.
టిప్పర్ వాహన డ్రైవర్ వివరాలు సేకరించగా, ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సాయవేణి ప్రవీణ్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.








