- ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె గ్రామ శివారులో గ్రామస్తులు, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివాలయ ఆలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి హాజరయ్యారు.శ్రీ మైలారం మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ, గన్నేరువరం వేద పండితులు మణి శంకర్ శర్మ, వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరగా నూతన ఆలయ నిర్మించడానికి గ్రామస్థులు, రెడ్డి సంఘం ముందుకు రాగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు ముస్కు కరుణాకర్ రెడ్డి, చిట్కూరి అనంతరెడ్డి, గ్రామస్తులు నంది రెడ్డి చంద్ర రెడ్డి, అరుకొంతం నరసింహ రెడ్డి, సాగర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గుండ్రెడ్డి మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు








