కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు 99 రోజుల కార్యక్రమ అమలుపై వారికి దిశనిర్దేశం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణలో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, గ్రామ సర్పంచ్ రంగనవేని లచ్చి నర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి,కార్యదర్శి వెంకటరెడ్డి, ఈ.పంచాయతీ ఆపరేటర్ దేశరాజు శివ సాయి, కారోబార్ మాధవరావు, వార్డు మెంబర్లు బోయిని కుమార్, మచ్చ సాయి కృష్ణ,వేదేరే విజయేందర్,రంగనివేణి సతీష్,మాజీ వార్డు మెంబర్ టేకు అనిల్,నాయకులు పురుషోత్తం శ్రీనివాస్ గౌడ్, బొడ్డు శ్రీనివాస్,దుర్ముట్ల కిట్టు తదితరులు పాల్గొన్నారు.








