contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుండ్లపల్లి లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

● మహిళల సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యం

● మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి సర్పంచ్ చింతల ఉమారాణి

కరీంనగర్ జిల్లా: మహిళల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సర్పంచ్ చింతల ఉమారాణి అన్నారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తనతో నేరుగా చర్చించవచ్చని కోరారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి హాజరై మహిళలను శాలువాతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో వార్డు మెంబర్లు గుర్రం స్పందన, పంబాల రాజు, పొలం దేవయ్య, బొజ్జ కృష్ణ స్వామి, వడ్లకొండ శ్రీనివాస్, పంబాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

సి.సి.రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం..

గ్రామ మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా, గుండ్లపల్లి ఎక్స్ రోడ్డులో నూతన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు.

తీరిన తాగునీటి సమస్య (బోర్ మరమ్మతు)

చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న బోరుకు అత్యవసర మరమ్మతులు చేయించి, మళ్లీ నీరు వచ్చేలా చర్యలు తీసుకున్నాము. దీనివల్ల గ్రామ ప్రజల నీటి కష్టాలకు విముక్తి లభించింది.

స్వచ్ఛ గ్రామంగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు

పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘తడి చెత్త – పొడి చెత్త’ వేరు చేయడంపై అవగాహన కల్పించారు. మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల అనిల్ కుమార్, వంగల సత్యనారాయణ రెడ్డి, గుర్రం మహేందర్ రెడ్డి, చింతల రవి, వంగల నరసింహారెడ్డి, చాడ సతీష్ రెడ్డి, చింతల పరుశురాం, ఎర్రోళ్ల రాజయ్య, జమిల్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :