కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ మరియు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యాసంవత్సరం 2025–26ను పురస్కరించుకొని పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామయ్య పాఠశాల వార్షిక ప్రగతి నివేదికను తల్లిదండ్రులు, గ్రామస్తుల ముందుంచి గత ఏడాది విద్యా, సహపాఠ్య కార్యక్రమాలలో సాధించిన విజయాలను వివరించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కరాటే ప్రదర్శనలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే సైన్స్ డే తదితర పోటీలలో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కె. రామయ్య, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సాయి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.








