- బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రం లో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో బుధవారం బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పదివేల మంది కార్యకర్తలతో అంజన్న ఆశీర్వాద పాదయాత్ర చేయబోతున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, పాల్గొంటారని తెలిపారు. మార్చి14 శనివారం ఉదయం 6 గంటలకు మహాశక్తి దేవాలయం, కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని గన్నేరువరం మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాములు, మచ్చ సాయి క్రిష్ణ,పుల్లెల జగన్మోహన్, దానవేని ప్రశాంత్, ఏలేటి శేఖర్ రెడ్డి, దానవీని ప్రశాంత్,పుర్ర హరీష్, బోయిని వేణు తదితరులు పాల్గొన్నారు.








