- చిగురుమామిడిలో 15నెలలపాటు డీటీగా సేవలు..
- ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి డిప్యూటీ తహశీల్దార్ తాడ స్వరూప రాణికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తహసిల్దార్ గా పదోన్నతి లభించింది. తహసిల్దార్ గా పదోన్నతి లభించిన స్వరూప రానిని చిగురుమామిడి తాహాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన బొమ్మనపెల్లి గ్రామ వాసి మన మండలములో డిప్యూటీతహసీల్దార్ సేవలను, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను కొనియాడారు. చిగురుమామిడి మండలంలో 15నెలల పాటు విధులు నిర్వర్తించి ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందించారు. పుష్పగుచ్ఛాలు,శాలువాలతో సత్కరించి,నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలుపుతూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు తారా దేవి, నాగరాజు, జిపిఓలు రమేష్ రెడ్డి, మహమ్మద్ రఫీ, రాములు, కొమురయ్య, శ్రీనివాస్, భూమయ్య, తెల్ల బాలరాజు, శ్రీనివాస్, ఆంజనేయులు, రాజబాబు,అనిత,భగవాన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, అనిత, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.








