contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో ఘనంగా శకటోత్సవం

  •  రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

 

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని మూడు రోజులపాటు జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, శకటోత్సవం, రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ అభరణాలు పంచామృతాలు,అభిషేకం చేశారు. నరసింహుని స్థానా చార్యులు అర్చకులు పరంకుశం యాదగిరి చార్యులు. వెంకటనారాయణ ప్రదీప్ చార్యులు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి పల్లెకి సేవలో తీసుకెళ్లి మూల నరసింహస్వామి దేవాలయ క్షేత్రంలో వేద పండితులు మణి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం జరిపించారు. అర్చకులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం శకటోత్సవం, శుక్రవారం ఉదయం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. మూల నరసింహస్వామి ఆలయం వద్ద శకటోత్సవం జరిగే ప్రదేశాన్ని ఎస్సై జి.నరేందర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వేములవాడ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్, గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, ఉప సర్పంచ్ రామంచ స్వామి, వార్డు సభ్యులు మచ్చ సాయి కృష్ణ, యాదవ సంఘం మండల అధ్యక్షుడు సంధవేణి ప్రశాంత్ యాదవ్,నాయకులు రేపాక బాబు, పుల్లెల నందయ్య, ముత్యం అంజయ్య గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవంలో గ్రామ పంచాయతీ కరోబర్ మాధవ్ రావు,శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ బోయిని అంజయ్య, ప్రజాప్రతినిధులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :