కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మంగళవారం జరిపారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జీవి రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గొల్లపల్లి రవి, పురుషోత్తం కిషన్ గౌడ్, బోయిని అంజయ్య, మీసాల ప్రభాకర్, బూర శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








